30, మార్చి 2020, సోమవారం

New song for carona

మాయదారి కరోనా మహమ్మారి కరోనా
నిన్ను చూసి ప్రపంచమే పడుతోంది హైరానా

చరణం:ఖండాలను కబళించే కసాయి కద కరోన
 కాలు కదపకుండ జనం విదించింది ఫర్మాన
 రెక్కలిరిగినా పక్షిలా  గూటికి పరిమితమైతే
 డొక్కలెండినా బతుకుల చితిని పేరుస్తుంది

చరణం:కరువు  రక్కసి నేడు వూరి నుండి తరిమితే సొంతగూటినొదిలి బతుకు వలసబాట పడితే
కర్కసి కరోనాతో ఉపాధి ఉరి పోసుకుంది
సాయంచేయని సర్కారు చోద్యం చూస్తుంది

చరణం: పరీక్షలను చేయకుండ  ప్రవాస పౌరులను
దేశంలోకొదిలి నేడు దిగ్భంధనమంటుంటే
కసి గట్టిన కరోనాని పసిగట్టని పాలకులు
కష్టజీవి పై కసాయోళ్ళు రసాయనం చల్లుతారా

చరణం:బతుకు భద్రత లేదు భవిత భరోసా లేదు   పస్తులు పెరిగినవేళ ప్రసంగాల కొదువ లేదు ప్రత్యామ్నాయం చూపే పాలక చర్యే లేదు
కూలీల కన్నీళ్ళకి కరిగే దేవుడు లేడు

చరణం ; వున్నోడు కడుపునిండి సందేశాలిస్తుంటే
 పేదోడు కడుపు మండి ఆకలితో చస్తుంటే
 మానవతను మదిలో నింపి చేయూతనిద్దాం                    సాటి మనిషి కి సాయం చేతనైనది చేద్దాం

చరణం:కరోనా రాకాసి ని జాగ్రత్తతో జయిద్దాం
పరిశుభ్రత పాటించి పదిలంగా జీవిద్దాం
ప్రాణాలను కాపాడే డాక్టర్లని పూజిద్దాం
 జగతి ని నడిపే శ్రమజీవి కి గుడి కడదాం
             
                                             రచన : మంగరాజు
                                            ప్రజానాట్యమండలి
                                                  6300235878