మాయదారి కరోనా మహమ్మారి కరోనా
నిన్ను చూసి ప్రపంచమే పడుతోంది హైరానా
చరణం:ఖండాలను కబళించే కసాయి కద కరోన
కాలు కదపకుండ జనం విదించింది ఫర్మాన
రెక్కలిరిగినా పక్షిలా గూటికి పరిమితమైతే
డొక్కలెండినా బతుకుల చితిని పేరుస్తుంది
చరణం:కరువు రక్కసి నేడు వూరి నుండి తరిమితే సొంతగూటినొదిలి బతుకు వలసబాట పడితే
కర్కసి కరోనాతో ఉపాధి ఉరి పోసుకుంది
సాయంచేయని సర్కారు చోద్యం చూస్తుంది
చరణం: పరీక్షలను చేయకుండ ప్రవాస పౌరులను
దేశంలోకొదిలి నేడు దిగ్భంధనమంటుంటే
కసి గట్టిన కరోనాని పసిగట్టని పాలకులు
కష్టజీవి పై కసాయోళ్ళు రసాయనం చల్లుతారా
చరణం:బతుకు భద్రత లేదు భవిత భరోసా లేదు పస్తులు పెరిగినవేళ ప్రసంగాల కొదువ లేదు ప్రత్యామ్నాయం చూపే పాలక చర్యే లేదు
కూలీల కన్నీళ్ళకి కరిగే దేవుడు లేడు
చరణం ; వున్నోడు కడుపునిండి సందేశాలిస్తుంటే
పేదోడు కడుపు మండి ఆకలితో చస్తుంటే
మానవతను మదిలో నింపి చేయూతనిద్దాం సాటి మనిషి కి సాయం చేతనైనది చేద్దాం
చరణం:కరోనా రాకాసి ని జాగ్రత్తతో జయిద్దాం
పరిశుభ్రత పాటించి పదిలంగా జీవిద్దాం
ప్రాణాలను కాపాడే డాక్టర్లని పూజిద్దాం
జగతి ని నడిపే శ్రమజీవి కి గుడి కడదాం
రచన : మంగరాజు
ప్రజానాట్యమండలి
6300235878

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి