పోడుమీద పొడిచే పచ్చని పొద్దులా అడవి మీద ఎగిరే పావురాల గుంపులా స్వేచ్ఛగా, సహాజాతి సహజంగా....వాళ్ళ ు!వన్య ప్రాణులతో ఆటలాడుతూనో, అడవి పిట్టలతో పాట పాడుతూనొయీ కొండకోనల్లో ప్రవహించే స్వచ్ఛమైన సెలయేటి వాగుల్లా వాళ్ళు......వాళ ్ళ కడుపులో పోడు కాలినపుడు గంటికూర నంజుకుని చింతంబలో, టెంకంబలో....జుర ్రడం తెలుసు.ఆరారగా ఆకుల దొన్నల్లోని పుల్లేర్లు యేరుకుని పల్లీలు తిన్నట్టు ఒలుచుకు తినడం తెలుసు.యీవలేసిన పుడు,కుందేటి పిల్లలతో కలసి ఏట్లో మూతిపెట్టి తాగడం తెలుసు! అమృతవృక్షం జీలుగుచెట్టు మీంచి అపుడే దించిన కల్లు కడుపారా తాగి అడవి తల్లి ఒడిలో కంటినిండా నిదురోవడం తెలుసు!వెదురుచా పల మీద మామిళ్ళ రసాలారబోసి , తాండ్రజేసి, లోకం నోళ్ళను తీపిచేయడం తెలుసు!పుట్టతేన ె తీసి బొంగుల్లో పిండుకోవడం తెలుసు! విప్పపూల చెట్టెక్కి పిల్లంగోవితో పాటల పందిళ్ళు వేయడం తెలుసు!పున్నమి రాత్రుల్లో వెన్నెలచెట్టు కింద కిన్నెర మీటుతూనొ.....తు డుం కొడుతూనో......థ ింసాలాడడం తెలుసు!గూడేల ముందు తచ్చాడే నెమలి పిట్టలతో ఆటలాడుకోవడం తెలుసు.అడవిని కావుళ్ళకెత్తుకు ని వారపు సంతల్లో అమ్ముకోవడం తెలుసు!అంతేనా.. .....వాళ్ళకు అడవి మీంచి వీచే పోరుగాలికి నెగళ్ళై రగలడం తెలుసు! వాళ్ళ తునికాకు కావుళ్ళను దోచుకునేటందుకు కాటాను తొక్కిపడుతున్న కాలిబొటనవేళ్ళను ఖండించడం తెలుసు!అడవిని అప్పనంగా దోచుకుపోతున్న లారీల చుట్టూ మానవహారంలా మూగడం తెలుసు! పన్నాగాలు పసిగట్టి కొండల్ని మింగేస్తున్న ఉక్కు పడగల మీద విల్లమ్ములెక్కు పెట్టి అమ్మలాంటి అడవిని కాపాడుకోవడమెలాగ ో వాళ్ళకు బాగానే తెలుసు!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి